హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పర్యావరణహిత వినాయక విగ్రహాలు

విశాఖలో వినాయక చవితికి పర్యావరణహిత విగ్రహాలు సిద్ధమయ్యా యి. సోమవారం జగదాంబ వద్ద 8 అడుగుల గవ్వల గణేశుడు కొలువుదీరనున్నాడు. గాజువాకలో 99 అడుగుల గాజుల విగ్రహం శీలానగర్‌లో 100 కిలోల ఖర్జూరపు గణనాథుడు, సిరసపల్లిలో 50 వేల మొక్కలతో గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా సస్య గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. మట్టి విత్తనాలతో చేసిన విగ్రహాలతో ప్రకృతి రక్షణకు పెద్దపీట వేస్తున్నారు.