KDP: సిద్ధవటం పెన్నా నదిలోకి నీరు చేరడంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలకు పెన్నా నదిలో నీరు అందుబాటులోకి రావడంతో భక్తుల్లో ఆనందం నెలకొంది. నీటి కొరతతో నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం నదిలోకి నీరు చేరడంతో ఆ సమస్య తీరిందని స్థానికులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధవటం పెన్నా నదికి చేరిన నీరు


