హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంచు దుప్పటిలో ప్రకృతి అందాలు

ASR: అరకులోయను ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు మంచు దుప్పటిలా కప్పేసింది. ఉదయం 7 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకనంతగా మంచు తెరలు అలుముకోవడంతో లోయ పరిసరాలు శీతాకాలాన్ని తలపించాయి. చల్లటి గాలులు, పక్షుల కిలకిలరావాలు, మంచులో మసకబారిన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంచు అందాల్లో అరకు లోయ కొత్త సోయగాన్ని సంతరించుకుంది.