ASR: అచ్యుతాపురం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లకు రగ్బీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రగ్బీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగవెంకటరావు తెలిపారు. 45 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. అక్టోబరు 5, 6 తేదీల్లో కర్నూలులోని ఆదర్శ విద్యాసంస్థలో రెసిడెన్షియల్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 20లోగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రగ్బీలో ఉచిత శిక్షణ


