హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో కష్టపడేవారికే టికెట్లు: వంగా గీత

కాకినాడ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకే సీట్లు ఇచ్చి గెలుపొందాలని పిఠాపురం YCP ఇంఛార్జ్ వంగా గీత పిలుపునిచ్చారు. మున్సిపల్ కళ్యాణ మండపంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని, సమన్వయంతో విజయానికి కృషి చేయాలని ఆమె సూచించారు.