హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎంపీ

ELR: బీసీ సామాజికవర్గ ప్రజలు, యువత అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి సాధించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు. ఏలూరు, చోదిమెళ్ల ప్రాంతాలకు చెందిన యాదవ, గౌడ, ఇతర బీసీ వర్గాల నేతలు, యువకులు ఆదివారం ఎంపీని కలిసి సమస్యలను వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.