హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో 268 మండపాలకే అనుమతులు

GNTR: వినాయక చవితి సందర్భంగా తెనాలి మండలంలో 268 వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. 1 టౌన్‌ పరిధిలో 53, 2 టౌన్‌ పరిధిలో 57, 3 టౌన్‌ పరిధిలో 126, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 32 మండపాలకు అధికారికంగా అనుమతి లభించింది. ఎలాంటి అల్లర్లకు తావులేకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని డీఎస్పీ జనార్ధనరావు నిర్వాహకులకు సూచించారు.