హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహితకు వేధింపులు.. కేసు నమోదు

ELR: సత్రంపాడులోని ఓ వివాహితను ఏలూరుకు చెందిన వ్యక్తి వేధిస్తున్నట్లు వాపోయింది. ఘటనపై త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు వివరాల మేరకు.. నిందితుడు బాధితురాలితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె భర్తకు చూపిస్తానంటూ బెదిరించి సుమారు రూ.4 లక్షల నగదు, బంగారం తీసుకున్నట్లు సీఐ తెలిపారు. తనతో ఉండకపోతే బాధితురాలిని, ఆమె భర్తను చంపేస్తానంటూ బెదిరించినట్లు పేర్కొన్నారు.