ASR: గంజాయికి యువత, ప్రజలు దూరంగా ఉండాలని ముంచంగిపుట్టు ఎస్సై నాని సూచించారు. వనభసింగి పంచాయతీ కొత్తూరు జంక్షన్ వద్ద నిన్న సాయంత్రం గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి కారణంగా చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయని తెలిపారు. గంజాయి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలన్నారు. గంజాయి సాగు చేసినా, రవాణాకు పాల్పడినా జైలు శిక్ష తప్పదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గంజాయికి దూరంగా ఉండాలి'


