హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా

కాకినాడ: సామర్లకోట పట్టణ YCPలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం పట్టణానికి చెందిన BC సెల్ జిల్లా నాయకుడు వేగి సత్యనారాయణ (సత్తిబాబు) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు YS జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పెద్దాపురం, సామర్లకోటలో రాజీనామాలు కొనసాగుతుండటం గమనార్హం.