హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు'

WG: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మొగల్తూరు ఎస్సై సీహెచ్ జయలక్ష్మి సూచించారు. ఆదివారం పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆమె స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల వద్ద ఎలాంటి డీజే సౌండ్ సిస్టమ్స్ కు అనుమతి లేదని స్పష్టం చేశారు.