హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్తాం: దాడిశెట్టి

KKD: తుని పట్టణ TDP నాయకత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆదివారం ఆరోపించారు. YCP విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తుని పట్టణంలో 7 అంశాలపై నిర్వహించిన సర్వేలో 6 అంశాల్లో ప్రజల నుంచి వ్యతిరేక స్పందన వచ్చిందని తెలిపారు. గతంలో తమ పార్టీ చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగుతున్నామని రాజా పేర్కొన్నారు.