E.G: కోరుకొండ మండలంలో పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. వినాయక పూజ కోసం పూలు కోసేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు వ్యక్తులు నీటి ఊబిలో కూరుకుపోయి దుర్మరణం చెందారు. మృతులను వీరబాబు (35), శివ (35)గా గుర్తించారు. లోపల ఊబి ఉన్న విషయం గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బయటకు రాలేక ఊపిరాడక ప్రాణాలు విడిచారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
పండుగ వేళ ఘోర విషాదం


