హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ వెలుగుల్లో దేదీప్యమానంగా తిరుమల

TPT: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా మారింది. అలిపిరి నుంచి తిరుమల వరకు ప్రధాన కూడళ్లు, ఆలయ పరిసరాలు రంగురంగుల LED లైట్లతో అలంకరించారు. గరుడ, గజ, హనుమంత, శేష వాహనాలతో పాటు దశావతారాలు, గజలక్ష్మి తదితర విద్యుత్ కటౌట్లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. TTD విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేపట్టారు.