WG: నూతన పెన్షన్ల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న దరఖాస్తుల సమయాన్ని నెలాఖరు వరకు పెంచాలని CPM ఆకివీడు ఏరియా కమిటీ డిమాండ్ చేసింది. నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహనుకు వినతిపత్రం ఇచ్చారు. సచివాలయాల్లో సిబ్బంది లేక దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారని, ప్రక్రియ నత్తనడకన సాగుతోందని పేర్కొన్నారు. పేదలకు న్యాయం జరిగేలా గడువు పొడిగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి: CPM


