హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్ బ్యాట్ బెటర్ పోటీలకు యశ్వంత్ ఎంపిక

AKP: అచ్యుతాపురం మండలం నునపర్తి గ్రామానికి చెందిన రెడ్డి యశ్వంత్ జాతీయస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీలకు ఎంపిక అయ్యాడు. మార్కాపురంలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా తరపున ప్రతిభ కనబరిచాడు. దీంతో అక్టోబరు 3 నుంచి 7 వరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాయిలో జరిగే 45వ జాతీయ సబ్‌జూనియర్ అండర్‌-16 పోటీలకు ఎంపికయ్యాడు.