హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రావి ఆకుపై బొజ్జ గణపయ్య.. మీరూ చూడండి!

తూ.గో: వినాయక చవితి సందర్భంగా అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన భద్దిర్రాజు లక్ష్మీ సుప్రజా పార్వతి తన సృజనాత్మకతను చాటుకున్నారు. రావి ఆకుపై విఘ్నేశ్వరుని ప్రతిమను తీర్చిదిద్ది లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆకు ఈనెలు దెబ్బతినకుండా ఎంతో శ్రమించి చెక్కిన ఈ బొజ్జ గణపయ్య రూపం చూసేవారిని విశేషంగా ఆకట్టుకుంటోంది.