హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా ప్రధాన రహదారి..!

BHNG: వలిగొండ మండలంలోని నాగారం అనుబంధ గ్రామం కమ్మగూడెం పరిధిలోని చిట్యాల-భువనగిరి ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. రాత్రివేళ గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.