హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకుంటున్న కొబ్బరి చిప్పలో ‘బొజ్జ గణపయ్య

కోనసీమ: కొబ్బరికాయను సాధారణంగా దేవుడి పూజకు ఉపయోగిస్తాం. అయితే ద్రాక్షారామానికి చెందిన హసన్బాద్ ZPH స్కూల్ డ్రాయింగ్ టీచర్ శ్రీను తన నైపుణ్యంతో కొబ్బరి చిప్పపైనే వినాయకుడిని చెక్కారు. కొట్టిన కొబ్బరి చిప్ప లోపల ఉన్న తెల్లటి కొబ్బరిపై బ్లేడుతో ఎంతో ఓపికగా, సూక్ష్మంగా గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. చుట్టూ ఉన్న కొబ్బరిని అందమైన డిజైన్గా మలిచారు.