హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి బీజేపీ అధ్యక్షుడిగా మధుసూదన్‌

వనపర్తి పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా బత్తిని మధుసూదన్‌ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరెడ్డి వెంకటరెడ్డి, పెద్దిరాజు, గజరాజుల తిరుమలేష్‌, నక్క మహేశ్, అరవింద్‌, ఖలీల్‌, గోపీనాథ్‌ పాల్గొన్నారు.