హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్టాండ్‌ దుకాణాల్లో అధిక ధరల దోపిడీ

CTR: చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న పలు దుకాణాలలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వాటర్ బాటిల్లు, తినుబండారాలను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న పట్టించుకునే వారి కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తనిఖీలు చేపట్టి దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు.