హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితితో పూలకు పెరిగిన డిమాండ్

KDP: ఖాజీపేట మండలం కొత్తపేట, దుంపలగట్టు, పాటిమీదిపల్లె, కొత్తపల్లె గ్రామాల్లో రైతులు సాగు చేసిన పూలకు వినాయక చవితి సందర్భంగా డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం కేజీ కనకాంబరం రూ.1,500, చిట్టి రోజాలు రూ.500, చామంతి రూ.350, సంపంగి రూ.220, బంతిపూలు రూ.150 వరకు ధర పలుకుతున్నాయి. పూల ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.