NTR: రైతులు, కౌలు రైతులు, కూలీలకు కరవు ప్యాకేజీ ప్రకటించి, వ్యవసాయ రుణమాఫీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడలో డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పనులను 200 రోజులకు పెంచి కనీస వేతనం అమలు చేయాలన్నారు. డ్వాక్రా వడ్డీలు రద్దు చేయాలని కోరారు. అక్టోబర్ నుంచే కొత్త పెన్షన్లు ఇవ్వాలని, 8 రకాల నిత్యావసర సరకులను చౌకధరకే అందించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కరవు ప్యాకేజీ ప్రకటించాలి: సీపీఎం


