హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కీసరలో రేషన్ బియ్యం పట్టివేత

NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామం మామిడి తోటల్లో రెవెన్యూ అధికారులు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉన్న 28 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షేక్‌ ఖాజా రెహముద్దీన్‌ ఆ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కీసర రేషన్‌ షాపునకు అప్పగించి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.