NTR: జగ్గయ్యపేటలోని ఉక్కు కళావేదికలో వినాయక చవితి మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ పి. వెంకటేశ్వర్లు, ఎస్సై జి. రాజు భద్రతా సూచనలు చేశారు. విద్యుత్ భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, డీజే వినియోగంపై వివరించారు. ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. పందిళ్ల వద్ద గొడవలు చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మండపాల వద్ద గొడవలు పడితే చర్యలు: సీఐ


