హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మండపాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి: సీఐ

కృష్ణా: బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని వినాయక మండపాల నిర్వాహకులతో రూరల్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. ఒకటి కంటే ఎక్కువ డీజేలు వినియోగించకూడదని స్పష్టం చేశారు.