హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలి: సీఐ

కృష్ణా: గన్నవరం మండలంలో వినాయక చవితి పందిళ్లు ఏర్పాటు చేసే వారు పంచాయతీ, పోలీస్, విద్యుత్, ఫైర్ శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సీఐ శివ ప్రసాద్, ఎస్సై శ్రీధర్ సూచించారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. రాత్రివేళ ఒకరిద్దరు కమిటీ సభ్యులు మండపాల వద్ద ఉండాలని తెలిపారు. సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.