హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి కుప్పలతో రాకపోకలకు ఆటంకం

కృష్ణా: అవనిగడ్డలోని 2వ వార్డు కొత్త వంతెన సమీపంలో డ్రైన్ తవ్వి మట్టిని రోడ్డుపై వదిలేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. మట్టి కారణంగా రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే తొలగించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.