హైదరాబాద్: 28°C
భక్తి

టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లు రద్దు

AP: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల పంపిణీని టీటీడీ నిలిపివేసింది. ఈనెల 20న తిరిగి టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. కాగా, ఈరోజు (సోమవారం) రాత్రి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తి శ్రీమలయప్ప స్వామివారు నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. గరుడ వాహనసేవ సా.6.30 గంటలకే ప్రారంభం కానుంది.