హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

ELR: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని గణనాథుని ప్రార్థిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.