హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ చోరీ..కేసు నమోదు..!

KDP: బద్వేలులోని సిద్దవటం రోడ్డు మహేశ్వరరెడ్డి స్కూల్ ప్రాంతంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. లగసాని నాగేశ్వరమ్మ ఇంటి తలుపు తాళం కోసి గుర్తుతెలియని దుండగులు 15 తులాలకు బంగారం, కిలో వెండి అపహరించినట్లు సమాచారం. 2 రోజులుగా తల్లి ఇంటి వద్ద ఉన్న నాగేశ్వరమ్మ ఆదివారం ఇంటికి తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.