హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం: సునీతకుమారి

ADB: విదేశాల్లో మాస్టర్స్, డాక్టరేట్ అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి భగత్ సునీతకుమారి ఆదివారం తెలియజేశారు. 2026 పథకం కింద మొత్తం 350 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.