హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రావణి

ATP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని MLA బండారు శ్రావణి దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఎల్‌నీనో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ధైర్యం ప్రసాదించాలని కోరారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరిసేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు.