హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో అంబరాన్ని తాకిన వినాయక ఆగమనం

ATP: తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో వినాయక చవితిని పురస్కరించుకొని బొజ్జ గణపతి యూనియన్ ఏర్పాటు చేస్తున్న 20 అడుగుల భారీ విగ్రహ ఆగమనం వేడుకలు ఘనంగా జరిగాయి. అఘోర వేషధారణలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'బొజ్జ గణపయ్య రావయ్య, జై బోలో గణేష్ మహరాజ్ కి జై' నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.