హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలి: మంత్రి

ATP: జిల్లా ప్రజలకు ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని పూజలను భక్తిశ్రద్ధలతో పర్యావరణ హితంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల బదులు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వారు సూచించారు. పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.