హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్వతగిరిలో నేటి ప్రజావాణి రద్దు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం(నేడు) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినాయక చవితి సందర్భంగా వాయిదా వేసినట్లు MPDO మాలోత్ శంకర్ నాయక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 21న సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన సూచించారు.