హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ మండపాలను సందర్శించిన TGSPDCL సీఎండీ

HYD: వినాయకఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, పటిష్ట భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ తెలిపారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ మండపాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఉచిత విద్యుత్ కనెక్షన్లు, అత్యవసర బ్యాకప్‌తో పాటు సమస్యల పరిష్కారం కోసం 1912 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు.