హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థిని సన్మానించిన ఎంపీడీఓ

KMR: జుక్కల్ మండల పరిధిలోని పడంపల్లి గ్రామానికి చెందిన వెంకట్ సాయివిష్ణు ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన సందర్భంగా జుక్కల్‌ ఎంపీడీఓ శ్రీనివాస్‌ ఆదివారం విద్యార్థిని కలిసి అభినందించారు. ఈ క్రమంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. జుక్కల్‌ లోని గ్రామీణ ప్రాంత విద్యార్థి ఎంబీబీఎస్‌‌లో సీటు సాధించడం మండలానికే గర్వ కారణమన్నారు.