HYD: అల్వాల్-బొల్లారం రైల్వే మార్గంలో ఆదివారం MMTS రైలు ఢీకొని మచ్చ బొల్లారానికి చెందిన రాచమల్లు ధనరాజ్(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన లోకో పైలట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. GRP SI SV సుబ్బారెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
MMTS రైలు ఢీకొని వ్యక్తి మృతి


