హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి'

KMM: ఈనెల 27, 28వ తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం కోరారు. ఆదివారం ఖమ్మం బంజారా భవన్‌లో మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గిరిజనుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తు పోరాటాలకు మహాసభలు దిశానిర్దేశం చేస్తాయని ఆయన తెలిపారు.