హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో మాదిగల ఆత్మీయ సమావేశం

KNR: కరీంనగర్ పట్టణంలోని ఎంపీర్ గార్డెన్‌లో మాదిగ మహాశక్తి ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రణవ్ బాబు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మాదిగల సమస్యలు, హక్కులు, సామాజిక అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు.