హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ జీవనాధారం దెబ్బతింది: జీపీ సిబ్బంది

KMR: భిక్కనూరు గ్రామపంచాయతీ సిబ్బంది స్వామిని విలేకరి గంగల రవి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపిస్తూ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. తనకు చెప్పని పని చేయించేందుకు విలేకరి ఒత్తిడి చేయడంతో ఈవో మహేష్ గౌడ్ విధులకు రావద్దని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కుటుంబ జీవనాధారం దెబ్బతిన్నదని, తనకు న్యాయం చేయాలని స్వామి కోరారు.