హైదరాబాద్: 28°C
తెలంగాణ

విలేకరికి గ్రంథాలయ ఇన్‌ఛార్జ్ బెదిరింపులు

WGL: నల్లబెల్లి గ్రంథాలయంలో గుట్కా ప్యాకెట్లపై వార్త రాసినందుకు విలేకరిని ఇన్‌ఛార్జ్ లక్ష్మీనారాయణ బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'నేనే ఇన్‌ఛార్జ్.. ఎవరికి చెబుతావో చెప్పుకో' అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని విలేకరి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.