హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చదవడం మాకు ఇష్టం' కార్యక్రమం

VZM: చిన్నతనం నుంచే పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు చేయాలని తెర్లాం శాఖా గ్రంథాలయ అధికారి కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం నిర్వహించిన 'చదవడం మాకు ఇష్టం' కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులతో గోరుముద్దల కథలు, తాతయ్య చిక్కు ప్రశ్నలు, బాలమిత్ర కథలు మరియు హాస్య కథలను చదివించారు. పుస్తక పఠనం ద్వారా పిల్లల్లో జ్ఞానం, ఆలోచనా శక్తి మెరుగవుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.