హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారికి వజ్రాభరణాల విరాళం

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బెంగళూరుకు చెందిన సీ.పద్మజ, కే.రాఘవేంద్రరావు దంపతులు రూ.3.78 లక్షల విలువైన వజ్రాభరణాలను శనివారం భక్తిశ్రద్ధలతో విరాళంగా సమర్పించారు. అన్ కట్ వజ్రాలు, కెంపులు, పచ్చలతో అలంకరించిన ఒక జత స్టడ్స్‌ను అమ్మవారి సేవకు అందజేశారు. అమ్మవారి అనుగ్రహం పొందాలనే భక్తిభావంతో ఆభరణాలను సమర్పించినట్లు దాతలు తెలిపారు.