SRD: వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం కలెక్టరేట్తో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. పండుగ సెలవు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తెలంగాణ
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్


