హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో మీటర్‌ రీడర్‌ మృతి

MDCL: కుత్బుల్లాపూర్‌ జలమండలి మీటర్‌ రీడర్‌ కిరణ్‌ అనే వ్యక్తి సమ్మెలో పాల్గొంటూ గుండెపోటుతో మృతి చెందాడు. జీతాలు రాకపోవడం, అధికారుల వేధింపులు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైనట్లు తోటి కార్మికులు తెలిపారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తుండగా కిరణ్ చనిపోయాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కార్మికులు కోరారు.