హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని

HNK: హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రసాయన విగ్రహాలతో నీటి వనరులు కలుషితం కాకుండా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.