హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి గణపతులను పూజించాలి'

BHNG: మట్టి గణపతులను పూజించాలని  ఆలేరు మండల చేనేత సహకార సంఘం చైర్మన్ దాసి శంకర్ అన్నారు. కొలనుపాక గ్రామంలో కాశెట్టి అంజయ్య జ్ఞాపకార్థం ఆదివారం జరిగిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పండుగను ప్రశాంతంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేత రమేష్, ఆధ్యాత్మికవేత్త వంగపల్లి అంజయ్య స్వామి, స్థానికులు పాల్గొన్నారు.