హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్​

KMR: జిల్లాలోని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ మేరకు అటవీశాఖ ఆదేశాలు జారీ చేసింది. బొల్లారం అటవీ సెక్షన్ పరిధిలోని ఎక్కపల్లి తండా, ఎక్కపల్లి, పర్కల్, శెట్పల్లి అటవీ బీట్ల పరిధిలో అడవుల నరికివేత, అటవీ భూముల ఆక్రమణలను నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనను సస్పెండ్ చేశారు.